భార్యాబిడ్డల హత్య: 20 ఏళ్ల తర్వాత వ్యక్తి అరెస్టు

Arrest
భోపాల్/ హైదరాబాద్: భార్యను, కూతురిని హత్య చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి 20 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ జిల్లాకు చెందిన దత్ గురు అలియాస్ కనకరాజును పోలీసులు భోపాల్‌లోని ఓ ఆలయం వద్ద అరెస్టు చేశారు. 1993లో అతను భార్యను, కూతురిని నాగపూర్‌లో అరెస్టు చేశాడు.

కనకరాజు నుంచి పోలీసులు 37 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హత్య చేసిన తర్వాత కనకరాజు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఆలయాల్లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని నిందితుడు పోలీసులకు తెలిపారు. అతడ్ని నాగపూర్ పోలీసులకు అప్పగించనున్నారు.

ఇదిలావుంటే, కడప జిల్లాలోని మైదుకూరు - ప్రొద్దుటూరు రోడ్డులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా తన భార్య గొంతు కోశాడు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటంబ కలహాల కారణంగా అతను ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో బాబు అనే వ్యక్తిని హత్య చేశారు. ఇంటి సరిహద్దు విషయంలో బాబుకు, పక్కింటివారికి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బాబు హత్యకు గురయ్యాడు.

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం లక్ష్మీపురం తండాలో ఓ యువకుడు బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. సోమవారంనాడు ఈ ఘటన జరిగింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితుడు పరారీలో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+