అలా అంటే బాధేస్తోంది: సబిత, రాజీనామాలపై ట్విస్ట్

పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసమే పని చేశామన్నారు. మైనింగ్ రూల్స్ ప్రకారమే జివోలు జారీ చేశామన్నారు. నిబంధనలకు లోబడే విధులను నిర్వర్తించామన్నారు. తాము నిర్దోషులుగా బయటకు వస్తామన్నారు. తాము అవినీతికి పాల్పడ్డామని సిబిఐ ఎక్కడా చెప్పలేదన్నారు. తమకు మొదటి నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సహచర మంత్రులు అండగా నిలబడ్డారన్నారు.
మంత్రి పదవులు అడ్డుపెట్టుకొని తాము స్వార్థం కోసం పని చేయలేదన్నారు. కళంకిత మంత్రులు, అవినీతి మంత్రులు అని వ్యాఖ్యానిస్తుంటే బాధేస్తుందన్నారు. నిర్దోషులుగా నిరూపించుకునే అవకాశం తమకుందన్నారు. తాము అవినీతికి పాల్పడ్డామని సిబిఐ ఎక్కడ చెప్పలేదన్నారు. పార్టీ ప్రతిష్ట కోసమే పని చేశామన్నారు. సిబిఐ ఎక్కడా తాము తప్పు చేసినట్లు చెప్పలేదన్నారు. తాము నిర్దోషిగా బయటకు వస్తామన్నారు. తమ నిజాయితే తమను కాపాడుతుందన్నారు.
రాజీనామాలపై ట్విస్ట్
రాజీనామాల విషయంలో ధర్మాన, సబితలు ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు రాజీనామాలు సమర్పించారా అని ప్రశ్నిస్తే గత ఆగస్టులోనే తాను ఇచ్చానని ధర్మాన, గత నెల ఏప్రిల్ 8న ఇచ్చానని సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. తాజాగా రాజీనామా చేశారా అనే దానిపై వారు స్పష్టంగా స్పందించలేదు. గతంలో చేసిన రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని మాత్రం చెప్పారు.












Click it and Unblock the Notifications