రండి: కెసిఆర్, నెలాఖరు దాకా చూస్తాం: టి - ఎంపిలు

ఈ నెలాఖరు దాకా వేచి చూస్తామని కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు కెసిఆర్‌కు చెప్పారు. ఈ ఎన్నికల లోపే తెలంగాణ సాధించాలని తాము ప్రయత్నిస్తున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ సాధన కోసం అందరం కలిసి పని చేద్దామని కెసిఆర్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులతో చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చే పరిస్థితిలో లేదని, సాధ్యమైనంత త్వరగా తమ పార్టీలోకి రావాలని ఆయన అన్నారు.
తన ఫామ్‌హౌస్‌ను, తన వ్యవసాయ సాగును కెసిఆర్ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు చూపించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులతో జరిగిన భేటీలో కెసిఆర్‌తో పాటు తెరాస నాయకులు హరీష్ రావు, కెటి రామారావు, వినోద్ పాల్గొన్నారు. వచ్చే నెల 3వ తేదీలోగా కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెరాసలో చేరవచ్చునని భావిస్తున్నారు.
జూన్ 3వ తేదీ తర్వాత మంచి రోజులు లేవని, తెరాసలో చేరితే ఈలోగానే చేరాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈలోగా చేరకపోతే ఆగస్టు వరకు వేచి చూడాల్సి ఉంటుందని అంటున్నారు. ఎఐసిసి అధికార ప్రతినిధి చాకో ప్రకటన తర్వాత కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు.












Click it and Unblock the Notifications