వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ ఇంకొంత కాలం ఉంటే ముందుండేవాళ్లం: కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajiv Gandhi remembered on 22nd death anniversary
హైదరాబాద్/కడప: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మరికొంతకాలం దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఉంటే భారత దేశం అగ్ర రాజ్యాలను దాటి ఉండేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని గాంధీ భవన్‌లో నిర్వహించారు.

రాజీవ్ చిత్ర పటానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు. రాజీవ్ మరింత కాలం ప్రధానిగా ఉంటే దేశం మరింత ముందుకు పోయేదన్నారు. చరిత్రను తిరగరాసే నిర్ణయాలను ఆయన తీసుకున్నారన్నారు.

సామాన్యులకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చింది రాజీవ్ గాంధే అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వాలు అవసరమని ప్రజలకు వివరించాలని బొత్స సూచించారు. పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కు, స్థానిక సంస్థలకు అధికారాలు నిర్ణయాలు తీసుకున్నది రాజీవే అన్నారు.

రాజీవ్ 22వ వర్ధంతి మంగళవారం దేశవ్యాప్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన స్మృతి చిహ్నం వీర్ భూమి వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు రాజీవ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.

English summary
Former Prime Minister Rajiv Gandhi was Tuesday remembered on his 22nd death anniversary with leaders paying homage at his memorial here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X