వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓక్లహామాలో బలమైన టోర్నడోలు: 91 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Powerful tornado hits Oklahoma City, 91 killed
ఎడ్మండ్: అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. వీటి ప్రభావానికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. టోర్నడోల విధ్వంసానికి 91 మంది మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో 20 మంది పిల్లలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రజలు భయభ్రాంతులకులోనై సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. టెక్సాస్‌నుంచి మిన్నెసొటా వైపు పయనిస్తున్న తుఫాను ప్రభావం ఒక్లహామా, కన్సాస్‌పై తీవ్రంగా ఉంది. టోర్నడోలు విరుచుకుపడడంతో షావన్‌నీ పట్టణంలోని వీధులు, ఇళ్లు దుమ్ము, ధూళి, బురదతో నిండిపోయాయి. రహదారులపై వాహనాలు తిరగబడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది.

కన్సాస్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. టోర్నడోల ప్రభావం పూర్తిగా తొలిగిపోలేదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఒక్లహామా నగరంలో తొలుత 51 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో 40 శవాలను వెలికి తీశారు.

తమను భారీ టోర్నడో తాకిందని ఒక్లహామా గవర్నర్ మేరీ ఫాలిన్ చెప్పారు. చాలా నిర్మాణాలు కూలిపోయాయని చెప్పారు. ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లాలని ప్రజలను కోరినట్లు పోలీసు చీఫ్ మూరే చెప్పారు. మరిన్ని టోర్నడోలు తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

English summary
At least 91 people, including seven children at an elementary school, were killed after a massive tornado hit Oklahoma City in South Central US ripping roofs off buildings, levelling homes, and cutting a wide path of destruction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X