చంద్రబాబుకు సెగ: గద్దె రామ్మోహన్ వర్సెస్ కేశినేని

అయితే, గద్దె రామ్మోహన్ రావు బెజవాడ సీటుపై ఆశలు వదులుకున్నట్లు లేదు. రాజకీయాల్లో డబ్బులు అవసరమేనని అంగీకరిస్తూనే డబ్బే రాజకీయం కాదని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ రావు అన్నారు. రాజకీయాల్లో డబ్బు ప్రధానమేనని, అయితే డబ్బే రాజకీయం కాదని గద్దె వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ తనకు సీటు ఇస్తే తాను డబ్బు ఖర్చు పెడతానని బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎంపీ సీటు తన డిమాండ్ అని, అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నడుచుకుంటానని గద్దె తెలిపారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారు డబ్బు ఖర్చుపెడితే, ఎప్పటినుంచో పార్టీలో ఉండి డబ్బు ఖర్చుపెడుతున్నవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. త్వరలో చంద్రబాబును కలిసి ఎంపీ సీటు హామీ పొందుతానని తెలిపారు.
గతంలో విజయవాడ ఎంపీగా గెలిచి, అనంతరం రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి గద్దె రామ్మోహన్ ఓడిపోయారు. అయితే, కేశినేని అంత సులభంగా గద్దె రామ్మోహన్ రావు ఆ సీటును వదులుకునేట్లు లేరు. ఏమైనా, విజయవాడ తెలుగుదేశం రాజకీయం రసకందాయంలో పడేట్లు కనిపిస్తోంది. మరోవైపు, వల్లభనేని వంశీకి సీటు ఇస్తారా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. కేశినేని నాని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జీ మాత్రమేనని గద్దె రామ్మోహన్ రావు అన్నారు.
చంద్రబాబు కేశినేని నాని వైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నారు. కేశినేని వైపు చంద్రబాబు మొగ్గు చూపితే మరోసారి విజయవాడ తెలుగుదేశం పార్టీలో సమస్యలు తలెత్తవచ్చు.












Click it and Unblock the Notifications