ఫ్రెండ్ ఫోన్ మాట్లాడ్తుండగా: హైదరాబాద్ టెక్కీపై ఘోరం

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం రాత్రి స్నేహితుడితో కలిసి వస్తుండగా ఈ ఘటన జరిగింది. స్నేహితుడు ఫోన్ మాట్లాడుతూ కాస్త ముందుగు వెళ్లగా.. నిందితులు ఈమెను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకు వెళఱ్లి స్పృహకోల్పోయేలా చేశారు. అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చాక మరోసారి అత్యాచారం చేసి అక్కడే వదిలి వెళ్లారు. పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బాలికపై దారుణం.. ఆపై హత్య
కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలైన ఓ బాలిక బుధవారం రాజస్థాన్‌లోని ఉదయపూర్ ఆసుపత్రిలో మరణించింది. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఆమెపై దారుణం జరిగింది. సకారియా గ్రామంలో ఈ నెల 11వ తేదిన బాధిత బాలికపై భాను ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిప్పు అంటించాడు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.
చిన్నారిపై ఘోరం
రెండేళ్ల పసిపాపపై అత్యాచారం చేసిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. నిందితుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్షను విధించింది. అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎంసి గుప్తా ఈ మేరకు నిందితుడికి శిక్షను విధించాడు. 2010లో తన బంధువులైన చిన్నారి తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications