కెసిఆర్‌కు షాక్: మాజీ ఎంపి గుడ్‌బై, సిట్టింగ్‌లపై ప్రచారం

పార్టీ నుండి సస్పెండ్ అయిన చాడ సురేష్ రెడ్డి టిడిపిలోకి రానున్నారు. మరో బహిష్కృత నేత రఘునందన రావు బిజెపిలోకి వెళ్లవచ్చునని అంటున్నారు. ఇప్పుడు రుమాండ్ల టిఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఇవన్నీ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎదురు దెబ్బే అంటున్నారు. రుమాండ్ల గతంలో టిడిపి నుండి టిఆర్ఎస్‌లో చేరారు.
తెలంగాణ కోసం కాదు: రుమాండ్ల
తెరాస తెలంగాణవాదం కోసం లేదని రామచంద్రయ్య ఈ సందర్భంగా ఆరోపించారు. ఆగస్టులో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తెరాసలో ధనికులకే ప్రాధాన్యత ఉంటుందన్నారు. రుమాండ్ల బిజెపిలో లేదా టిడిపిలో చేరుతారని చెబుతున్నారు.
వరంగల్ ఎమ్మెల్యేల పైన ప్రచారం
వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు తెరాస అధినేత వచ్చే ఎన్నికల్లో షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇది కొంత కలకలం రేపుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల పట్ల అధినేత అసంతృప్తితో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు ఇవ్వకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిని సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్రంగా కొట్టిపారేశారు.
బిజెపికి తప్ప..: దత్తాత్రేయ
వచ్చే ఎన్నికలలో బిజెపికి తప్ప ఏ పార్టీకి ఓటేసినా కాంగ్రెసుకు లబ్ధి చేకూరుతుందని బండారు దత్తాత్రేయ విశాఖలో అన్నారు. అవినీతి మంత్రులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదులో జూన్ 3న భారీ బహిరంగ సభ ఉంటుందని, అందులో జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారని చెప్పారు. జూలైలో హైదరాబాదులో భారీ ర్యాలీ చేపడతామని అందులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారన్నారు.












Click it and Unblock the Notifications