గర్ల్స్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు, నిలోఫర్‌పై సిఎం ఆరా

ప్రేమికుల ఆత్మహత్య
ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లాకు చెందిన ఆదిత్య, వీణలుగా పోలీసులు గుర్తించారు.
యువకుడి గొంతు కోసిన వ్యక్తి
వరంగల్ జిల్లాలో తాగిన మైకంలో ఓ వ్యక్తి యువకుడి గొంతు కోశాడు. శాయంపేట మండలం పట్టిపాకలో ఇది జరిగింది. దిలీప్ అనే వ్యక్తి తాగిన మైకంలో దేవేందర్ అనే యువకుడి గొంతు కోశాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మహిళ వద్ద డబ్బులు
అభయ గోల్డ్ డైరెక్టర్ శ్రీనివాస రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన భార్య, మరో డైరెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ద్వారా ఆస్తుల అటాచ్‌మెంట్ చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. చీటింగ్, ఫోర్డరీ, మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేశారు. డైరెక్టర్ డబ్బంతా ఓ మహిళ వద్ద ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు
నిలోఫర్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు పెరిగాయి. చిన్నారుల మరణాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు. దిద్దుబాటు చర్యల కోసం అజయ్ సహానీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. నిలోఫర్ సహా మిగిలిన అన్ని ఆసుపత్రులను పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వడదెబ్బకు పలువురు మృతి
రాష్ట్రంలో వడదెబ్బకు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శుక్రవారం వడదెబ్బకు రాష్టవ్యాప్తంగా పది నుండి పదిహేను మంది వరకు మృతి చెందారు.












Click it and Unblock the Notifications