వ్యభిచారం చేయాలన్న భర్త: భార్య ఆత్మహత్య

వివరాలు ఇలా ఉన్నాయి - నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన ద్వారకా భద్రయ్య (40) రెండేళ్ల క్రితం జగ్గయ్యపేట ధనంబోడు కాలనీలో తన సోదరుడి వద్దకు పొట్టకూటి కోసం వచ్చాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న భద్రయ్య రెండు నెలలుగా పనికి వెళ్లడం లేదు. చెడు అలవాట్లకు బానిసై అప్పులు విపరీతంగా చేశాడు.
అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో భద్రయ్య భార్య అరుణ (35) విసుగు చెంది గురువారం అతడ్ని నిలదీసింది. బాకీలిచ్చిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నానని గొడవ పడింది. దీంతో, వ్యభిచారం చేసి బాకీలు తీర్చాలని భర్త అనడంతో మనస్తాపం చెందిన అరుణ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను కాపాడటానికి యత్నించిన భద్రయ్యకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పారు. చికిత్స పొందుతూ అరుణ మరణించింది. వీరికి ముగ్గురు పిల్లలు. జగ్గయ్యపేట ఎస్సై జేవీ రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థినులపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
ఇదిలా వుంటే, అనంతపురం నగరంలోని ఎస్కేయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ జీహెచ్ ఫిలిప్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఫిలిప్ మాజీ వీసీ కుసుమ కుమారి హయాంలో ఏడాదిన్నర పాటు రిజిస్ట్రార్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ)గా, బయోటెక్నాలజీ విభాగం ఇన్‌చార్జిగా ఉన్నారు.
ఆయన వద్ద గతంలో మంజునాథ్ అనే విద్యార్థి పీహెచ్‌డీ చేశాడు. ఆ సమయంలో ఎంఎస్సీ విద్యార్థినిగా ఉన్న తన (ప్రస్తుత పరిశోధక విద్యార్థిని)ను మంజునాథ్ వేధించేవాడని, ఈ విషయం పలుమార్లు ఫిలిప్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ వేధించేవారని, పైగా మంజునాథ్‌ను వెనకేసుకొచ్చేవారని బాధిత విద్యార్థిని పోలీసులకు చెప్పారు.
ప్రస్తుతం తనకు వివాహమైనా మంజునాథ్ వేధింపులు మానుకోలేదని, తనపై భౌతికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇటుకలపల్లి పోలీసులు ఇరువురి మీదా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications