వైయస్ పథకాలు మా హక్కు: కిరణ్‌కు ధీటుగా షర్మిల

దీనిపై షర్మిల పై విధంగా స్పందించారు. వైయస్ ప్రతి పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందని కానీ, తాను పెట్టిన విద్యుత్ ఛార్జీల పెంపు పథకాన్ని మాత్రం బాగా అమలు చేస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. ‘‘వైయస్సార్ మాకు ఆదర్శం, ఆయన ఆలోచనా విధానమే మాకు మార్గదర్శకం. ఆయన అమలు చేసి చూపెట్టిన పథకాలే మాకు స్ఫూర్తి. అందుకే వైయస్సార్ పథకాలను మా జెండాలో పెట్టుకున్నాం. వైయస్సార్ పథకాలు మా హక్కు'' అని షర్మిల అన్నారు.
వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలు కాంగ్రెసువే అయితే మిగతా కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో ఏవని ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెడదాం. సరే.. ఇవన్నీ కాంగ్రెస్ పథకాలే అయితే వాటిని రాష్ట్రంలో ఎందుకు సక్రమంగా అమలుచేయడం లేదో సమాధానం చెప్పాలి. వైఎస్సార్ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించాలని ఆయన ‘జలయజ్ఞం' ప్రవేశపెడితే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను అటకెక్కించిన మాట నిజమా? కాదా? అని అడుగుతున్నాం.
మరో ప్రజా ప్రస్థానం 157వ రోజు గురువారం షర్మిల పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని జెల్లికొమ్మర నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి వెలగపల్లి, వరదరాజుపురం, గొల్లలదిబ్బ, గణపవరం, సరిపల్లె గ్రామాల మీదుగా ఉండి నియోజకవర్గంలోని ఆరేడు గ్రామం వరకు యాత్ర చేశారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. గురువారం మొత్తం 11.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,083.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది.












Click it and Unblock the Notifications