నా ఊరికి రా తేల్చుకుందాం: టిడిపికి కడియం సవాల్

Mothukupalli Narasimhulu - Kadiyam Srihari
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఊసరవెల్లి కాదని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకే ఆ గుణాలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు ఆదివారం మండిపడ్డారు.

రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఊసరవెల్లి చంద్రబాబే అన్నారు. 2004లో సమైక్యాంధ్ర నినాదంతో, 2009లో తెలంగాణ నినాదంతో చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చారన్నారు. కమ్యూనిస్టులవి కాలం చెల్లిన సిద్ధాంతాలు అని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు వారి పొత్తు కోసం తహతహలాడుతున్నారన్నారు.

కమ్యూనిస్టులను విమర్శించిన ఆయనకు వారితో పొత్తు పెట్టుకునే నైతిక హక్కు ఎక్కడిది అన్నారు. 1999లో భారతీయ జనతా పార్టీ గొప్ప పార్టీ అయినప్పుడు, ఇప్పుడు మతతత్వ పార్టీ ఎలా అయిందో చెప్పాలని ప్రశ్నించారు.

మోత్కుపల్లికి కడియం సవాల్

తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు తెరాస నేత కడియం శ్రీహరి వేరుగా మండిపడ్డారు. మోత్కుపల్లికి సభ్యత, సంస్కారం ఉంటే తన కులం ఏమిటో నిరూపించేందుకు తన స్వగ్రామం పర్వతగిరి రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు పార్టీ మారితే తప్పులేదు కానీ ఇతరులు మారితే తప్పా అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక బాబు అప్పుడు ఆ పార్టీలో చేరారని, తాను అధికారంలో లేకున్నా ఆశయం కోసం చేరానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+