ఉపేక్షించొద్దు: నరేంద్ర మోడీ, రాములమ్మల కీలక పాత్ర

మావోయిస్టుల దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాయపూర్ చేరుకున్నారు. మావోయిస్టుల మారణ హోమంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. కాంగ్రెసు నేతలపై మావోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మోడీ చెప్పారు. ఈ దాడి ప్రజాస్వామ్యంపైనే దాడి అన్నారు. నక్సలిజం, ఉగ్రవాదంపై ఎలాంటి ఓర్పు వహించవద్దన్నారు.
కీలక పాత్ర పోషించిన మహిళా దళాలు - మహేంద్ర టార్గెట్
శనివారం సాయంత్రం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెసు నేతలపై జరిగిన దాడిలో మహిళా మావోయిస్టులు కీలక పాత్ర పోషించారని సమాచారం. దాదాపు పన్నెండు వందల నుండి పదిహేను వందల మంది వరకు ఈ దాడిలో పాల్గొన్నారు. అందులో 35 మందికి పైగా మహిళలు పాల్గొని కీలకంగా వ్యవహరించారని అనుమానిస్తున్నారు. సల్వాజుడుం నేత మహేంద్ర కర్మను టార్గెట్‌గా చేసుకున్నప్పటికీ సాధ్యమైనంత దెబ్బ తీయాలని మావోయిస్టులు భావించినట్లుగా అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు భద్రతా దళాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రంగంలోకి దిగిన బిఎస్ఎఫ్ కూంబింగ్ నిర్వహిస్తోంది. అడవులలో జల్లెడ పడుతోంది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ కుంట ఎమ్మెల్యే కవాతి లక్మోకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
రాష్ట్రపతి పాలన యోచన
ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు నేతలపై దాడి నేపథ్యంలో బిజెపి ప్రభుత్వంపై ఆ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. మారణ హోమం నేపథ్యంలో రాష్ట్రపతి పాలన తీసుకు రావాలా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications