బాబు మైనపు బొమ్మ: బుల్లి సైకిల్, చేపలు గిఫ్ట్

ఇదిలావుంటే, మహానాడులో చంద్రబాబు నాయుడికి కార్యకర్తలు అపురూపమైన కానుకలు అందజేశారు. హైదరాబాదులోని ముషీరాబాద్‌కు చెందిన మత్స్యకారుడు శివప్రసాద్ బుల్లి సైకిల్‌ను చంద్రబాబుకు బహుమానంగా అందించాడు. ఇందులో చేపల బొమ్మలు కూడా ఉన్నాయి.
కాగా, ఉప్పల్ నియోజకవర్గం కాప్రాకు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని రాము ఎన్టీఆర్ వేషధారణతో అలరించాడు. అచ్చం ఎన్టీ రామారావు హావభావాలు పలికిస్తూ సందడి చేశాడు. 2006 నుంచి తాను ఎన్టీఆర్ వేషధారణలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు రాము చెప్పాడు.
బాబు అధ్యక్షుడిగా నామినేషన్లు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడి పేరును ప్రతిపాదిస్తూ 24 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు పార్టీ నేత కెఇ కృష్ణమూర్తి చెప్పారు. రేపు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు పార్టీ అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
తొమ్మిదేళ్ల కాంగ్రెసు పాలనలో విద్యుచ్ఛక్తి రంగం ఛిన్నాభిన్నమైందని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేసింది. తెలుగుదేశం పార్టీ కాల్వ శ్రీనివాసులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా, నన్నపనేని రాజకుమారి బలపరిచారు.












Click it and Unblock the Notifications