వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ధైర్యంగా ఉన్నారు: సతీమణి వైయస్ బారతి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Bharathi and Ys Jagan
హైదరాబాద్: ప్రజల పక్షాన నిలబడినందుకే తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి విమర్శించారు. తమ కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె అడిగారు. వైయస్ జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి సోమవారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా భారతి మాట్లాడారు.

అరెస్టు అయిన వ్యక్తికి చట్టప్రకారం 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలని, కానీ జగన్‌ను అరెస్టు చేసి ఏడాది పూర్తయినా బెయిల్ రాకుండా చూస్తున్నారని ఆమె అన్నారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించి రెండేళ్లవుతున్నా జగన్‌కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేదని భారతి అన్నారు. విచారణ చేయకుండానే జగన్‌ను మొదటి ముద్దాయిగా ఎలా చేరుస్తారని ఆమె ప్రశ్నించారు. ఒక్క ప్రశ్న కూడా అడగకుండానే మూడు చార్జిషీట్లు దాఖలు చేశారని ఆమె తప్పు పట్టారు.

ప్రజలతో ఉండాలని అనుకోవడమే తాము చేసిన తప్పా అని ఆమె అడిగారు. జైలులో ఉన్న జగన్ ఎంతో ధైర్యంగా ఉన్నారని, ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారని భారతి అన్నారు. వ్యాపారాల్లో ఎక్కడా అవినీతి జరగలేదని ఆమె అన్నారు. ఒక ఎంపికే న్యాయం జరగకపోతే సాధారణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆమె ప్రశ్నించారు. బాధితాలకు న్యాయం చేయని చట్టాలు ఎందుకని ఆమె అడిగారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసికట్టుగానే జగన్‌పై కుట్ర చేశాయని ఆమె ఆరోపించారు.

ర్యాలీలో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు వైయస్ విజయమ్మ, వైయస్ అవినాష్ రెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. జగన్ నిర్బంధానికి నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి.

జగన్ విడుదల విషయంలో వైయస్సార్ కుటుంబ సభ్యులు దేవుడి మీద భారం వేశారని వైయస్ కుటుంబ సభ్యురాలు దివ్య చెప్పారు. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు నెక్లెస్ రోడ్డు వచ్చిన ఆమె మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన ప్రజలు అందరూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. జగనన్నను ఇంత కాలం జైలులో పెట్టడం అన్యాయంగా వీరు భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

English summary

 The YSR Congress party president YS Jagan's wife YS Bharathi said that YS Jagan is not fearing of anything. She accused that harassment has been meteted out at YS Rajasekhar Reddy family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X