వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరి, ఎన్టీఆర్ ఔట్: జగన్‌పై అటాక్, జాతీయ దృష్టి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahanadu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రెండు రోజుల మహానాడు చాలా వరకు పాత విషయాలనే వల్లె వేసింది. అయితే, ఇంతవరకు మాట్లాడుతూ వస్తున్న కొన్ని విషయాల్లో మాత్రం కాస్తా స్పష్టత ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణను, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం తేలిపోయింది. హరికృష్ణ మహానాడుకు వచ్చినప్పటికి తెలుగుదేశం కండువా వేసుకోవడానికి నిరాకరించారు.

అయనను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలేవీ చేసినట్లు లేదు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఆయన మహానాడుకు ఆహ్వానించలేదు. దీంతో వారిద్దరు దాదాపుగా పార్టీకి దూరమైనట్లేనని భావిస్తున్నారు. ఈ విషయంలో మహానాడు స్పష్టత ఇచ్చినట్లు భావిస్తున్నారు. తనను మహానాడుకు ఆహ్వానించలేదని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టంగా చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మహానాడులో దాడిని ఉధృతం చేశారు. రాజకీయ తీర్మానం జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, జగన్ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించింది. జగన్ అవినీతిని తెలియజెప్పే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు ప్రతిపాదించిన రాజకీయ తీర్మానంలో జగన్‌పై దుమ్మెత్తి పోశారు. ఆ తీర్మానంపై మాట్లాడిన చంద్రబాబు కూడా కేంద్ర మంత్రి చిరంజీవికి చురకలు అంటిస్తూనే జగన్‌పై ధ్వజమెత్తారు. పిల్ల కాంగ్రెసు కాంగ్రెసు పార్టీలో కలిసిపోతుందని ఆయన అన్నారు. కేసుల నుంచి బయటపడేందుకు వైయస్సార్ కాంగ్రెసును కాంగ్రెసులో కలిపేస్తారని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుకు ఎన్నికల తర్వాత మద్దతు ఇవ్వబోతోందని, ఆ విషయాన్ని వారే స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తోడు దొంగలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై కాస్తా స్పష్టత ఇచ్చినట్లు చేశారు. తాము 2008లో తెలంగాణపై చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ఇక, జాతీయ రాజకీయాలపై చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించినట్లు మహానాడు ద్వారా వెల్లడైంది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని, చక్రం తిప్పుతామని ఆయన అన్నారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్‌లను ఏర్పాటు చేసినట్లుగానే ఇప్పుడు తృతీయ ఫ్రంట్ విషయంలో కీలక పాత్ర పోషిస్తామని చంద్రబాబు చెప్పారు. సామాజిక న్యాయం నినాదంతో వచ్చిన చిరంజీవి పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు.

English summary
It is evident from Mahanadu that the telugudesam party president Nara Chandrababu Naidu has ignored Rajyasabha member Nandamuri Harikrishna and his son Jr NTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X