జూ.ఎన్టీఆర్ ఆవేదన: చంద్రబాబుకు లక్ష్మీ పార్వతి సలహా

రాజకీయ, కళారంగాల్లో ఆదర్శమైన వ్యక్తి ఎన్టీఆర్ ఒక్కరే అన్నారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఎన్టీఆర్ ప్రపంచ దేశాల్లో చాటారన్నారు. అందుకు తెలుగుజాతి మొత్తం ఆయనకు రుణపడి ఉందన్నారు. ప్రతి పేదవాడి దగ్గరకు వెళ్లారు కాబట్టే ఎన్టీఆర్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు.
అది ప్రచారంతో రాదని.. ప్రజల మనుసుల నుండి రావాలన్నారు. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తూ అందర్నీ కలుపుకొని పోవాలని కోరారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను కలుపుకొని వెళ్లాలని కోరారు. అప్పుడే టిడిపి అందరికీ చేరువవుతోందని, పూర్వవైభవం సంతరించుకుంటుందని చెప్పారు.
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందక పోవడంపై ఆమె స్పందించారు. జూనియర్‌కు ఆహ్వానం ఎందుకు పంపించలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. కుటుంబ సభ్యులను కలుపుకొనిపోతేనే పార్టీ బలపడుతుందని చెప్పారు. కాగా, తనకు మహానాడుకు ఆహ్వానం అందలేదని ఎన్టీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications