అందరివాడు: మంత్రి డొక్కా ఆఫీస్‌లో ఎన్టీఆర్ జయంతి

Dokka Manikya Vara Prasad
గుంటూరు/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ చెప్పినట్లుగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీలలో ఏర్పాటు చేసుకున్నట్లుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇప్పుడు అందరి వాడు అవుతున్నారు. జగన్ పార్టీ ఫ్లెక్సీలలో ఎన్టీఆర్ ఫోటో కనిపించడం, దానిపై హరికృష్ణ స్పందిస్తూ ఆయన అందరి వాడని చెప్పడం కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్‌ను కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు ఇప్పుడు సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలలు జరిగాయి. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ వేడుకలో మంత్రి డొక్కా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పారు. ఎన్టీఆర్ ప్రజల మనిషి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం డబ్బున్న వాళ్ల మనిషన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు.

కాగా, హైదరాబాదులో టిడిపి నిర్వహిస్తున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి అధినేత చంద్రబాబు నాయుడు, హరికృష్ణ, బాలకృష్ణలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాబు భారీ కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+