ఊరొదిలి వెళ్లండి: మహేంద్ర కొడుక్కి మావోల హెచ్చరిక

"వారంలో ఊరు వదిలి వెళ్లిపోండి. ఇల్లూ వాకిలి, ఆస్తులు వదిలేసి కుటుంబంతో సహా ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోండి. లేదంటే... నీ తండ్రికి పట్టిన గతే నీకూ పడుతుంది'' అని సబీంద్ర కర్మను నక్సల్స్ ఆ లేఖలో హెచ్చరించారు. సోమవారం తమ స్వగ్రామంలో దర్సాపాల్‌లో మహేంద్ర కర్మ అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే ఈ లేఖ పంపడం గమనార్హం. ఈ లేఖను మావోయిస్టులు దర్సాపాల్ సమీప గ్రామస్థుల ద్వారా సబీంద్ర కర్మకు పంపినట్లు తెలిసింది.
తాజా పరిణామాల నేపథ్యంలో మహేంద్ర కర్మ, నందకుమార్ పటేల్ కుటుంబాలకు జడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు.
ఎదురు కాల్పులు
సోమవారం సుక్మా జిల్లా మినప అటవీ ప్రాంతంలో సీఆర్ పీఎఫ్ జవాన్లు కూంబింగ్ చేస్తుండగా చెట్ల మాటునుంచి మావోయిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇరు పక్షాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు.












Click it and Unblock the Notifications