నిరసన పేరుతో ఉత్సవాలు: జగన్ పార్టీపై వర్ల రామయ్య

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఏడాది గడిచినందుకు ఆ పార్టీ నాయకులు నిరసనల పేరుతో ఉత్సవాలు చేసుకుంటున్నారని విమర్శించారు. వారి నిరసన సిబిఐ పైనా లేక సుప్రీంకోర్టు పైనా అనేది స్పష్టం చేయాలన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరవాత అక్రమార్జనను స్వాధీనం చేసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి అండతోనే జగన్ చంచల్‌గూడ జైలును పార్టీ ఆఫీస్‌గా మార్చుకున్నారని విమర్శించారు.
ప్రజలు నమ్ముతున్నారు: పాల్వాయి
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ప్రజలు నమ్ముతున్నారని కాంగ్రెసు నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్ని మహానాడులు నిర్వహించినా, ఎంత దూరం పాదయాత్ర చేసినా ప్రజలు విశ్వసించరన్నారు.
జగన్ జైలుకెళ్లి ఏడాది గడిచిన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం హాస్యాస్పదమని గండ్ర వెంకట రమణ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థపై నమ్మకం లేకనే ఇలా చేస్తున్నారని విమర్శించారు. సిబిఐ అభియోగాలు ఉన్నందువల్లే మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబిత ఇంద్రా రెడ్డిలు రాజీనామా చేశారని, భవిష్యత్తులోనూ ఇదే ఆనవాయితీ కొనసాగుతుందని చెప్పారు. టిడిపి మహానాడు 'దూకుడు' సినిమాలో రియాల్టీ షో వంటిదని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications