వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మర్యాదపూర్వకంగానే కలిశా: హరికృష్ణతో భేటీపై గద్దె

By Pratap
|
Google Oneindia TeluguNews

Harikrishna - Gadde
విజయవాడ: తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణను తాను మర్యాద పూర్వకంగా కలిశానని విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకుడు గద్దె రామ్మోహన్ రావు స్పష్టం చేశారు. అంతకు మించి తమ మధ్య ఎలాంటి రాజకీయ విశ్లేషణలు, చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. విజయవాడకు వచ్చిన హరికృష్ణతో ఓ హోటల్‌లో గద్దె సుదీర్ఘంగా గద్గె రామ్మోహన్ రావు సుదీర్ఘంగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అలిగి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న హరికృష్ణ, విజయవాడ పార్లమెంటు సీటుపై పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న గద్దె రామ్మోహన్‌ మధ్య మంతనాలు జరగడంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. భేటీపై కలకలం రేగడంతో గద్దె రామ్మోహన్ రావు వివరణ ఇచ్చారు.

హరికృష్ణను మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్లు ఆయన చెప్పారు. తనతోపాటు తమ పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, లంకా దాసరి, చలమలశెట్టి రామానుజయ్య కూడా ఉన్నారని తెలిపారు. హరికృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను కూడా ఎమ్మెల్యేనని, ఆ పరిచయంతోనే హరికృష్ణను కలిసి మాట్లాడానని చెప్పారు.

ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన పార్టీ మహానాడుకు హరికృష్ణ తొలి రోజు వచ్చారు. అయితే, చురుగ్గా వ్యవహరించలేదు. పార్టీ కండువా వేసుకోవడానికి కూడా నిరాకరించారు. రెండో రోజు పూర్తిగానే దూరంగా ఉన్నారు. పార్టీకి దూరమవుతూ వస్తున్న హరికృష్ణతో హోటల్ గదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ పార్లమెంటు సభ్యుడు గద్దె రామ్మోహన్ రావు బుధవారంనాడు సుదీర్ఘ మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి.

English summary
Clarifying on his meeting with Rajyasabha member and disgruntled party leader Nandamuri Harikrishna, the Telugudesam party Vijayawada leader Gadde Rammohan Rao said that it is a courtesy visit and it has no political importance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X