ప్రేమ వ్యవహారం: ఫోన్ కాల్‌తో ఆగిపోయిన పెళ్లి

Kaeimnagar
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో ఓ ఫోన్ కాల్‌తో వివాహం నిలిచిపోయింది. జిల్లాలోని గోదావరిఖని ఎన్‌టీపీసీ జ్యోతినగర్ అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతికి నగునూరు గ్రామానికి చెందిన కోట కనకయ్యతో గురువారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది.

అయితే, తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవద్దని రమేశ్ అనే యువకుడు పెళ్లికొడుకు కనకయ్యకు ఫోన్ చేశాడు. దాంతో పెళ్లికొడుకు పెళ్లి మండపానికి రాలేదు. విషయం తెలుసుకున్న వదువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ వ్యవహారం పోలీసుల కౌన్సెలింగ్‌తో ఓ కొలిక్కి వచ్ిచంది. ఫోన్ చేసిన యువకుడు, పెళ్లి కూతురు ప్రేమించుకున్నట్లు పోలీసుల కౌన్సెలింగ్‌లో బయటపడింది. తాము పెళ్లి చేసుకుంటామని ప్రేమికులు ఇద్దరు చెప్పడంతో దానికి పెద్దలను ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు.

ఫోన్ చేసిన యువకుడు రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి, పెళ్లి కూతురికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని యువతి చెప్పింది. పెద్దలు కూడా ఇందుకు అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+