బర్తరఫ్‌కు బదులు..: డిఎల్ ఆవేదన, కిరణ్‌తో తాడోపేడో

తనను బర్తరఫ్ చేశారనే విషయం తెలుసుకున్న డిఎల్ ఆవేదన చెందడంతో పాటు ముఖ్యమంత్రి పట్ల ఆగ్రహంతో ఉన్నారట. తాను పార్టీ కోసమే పని చేశానని, బర్తరఫ్ చేయడం బాధ కలిగించిందని, గతంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశానని, దానిని ఆమోదించినా సరిపోయేదని, అదిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని భావించలేదని ఆవేదన చెందారట. రేపు రాష్ట్రానికి రానున్న డిఎల్ తొలుత మైదుకూరులో తన వర్గం వారితో, ఆ తర్వాత పార్టీకి చెందిన సీనియర్లతో సమావేశమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
డిఎల్ పార్టీలోనే ఉంటూ తనను బర్తరఫ్ చేసిన కిరణ్‌తో ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతారని అంటున్నారు. అలాగే ఢిల్లీ పెద్దలను కలిసి కూడా చర్చించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్లో ఉండి కిరణ్ పైన విమర్శలు గుప్పించిన డిఎల్ ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముందంటున్నారు.
కాగా, డిఎల్ బర్తరఫ్‌ను నిరసిస్తూ కడప జిల్లా ఖాజీపేటలో కాంగ్రెసు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కడప - కర్నూలు రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. డిఎల్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారనే కారణంతో ఓ మహిళ కిరోసిన్ పోసుకొని అత్మహత్యాయత్నం చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాస్తా రోకో నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.












Click it and Unblock the Notifications