వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుకు గుడ్‌బై: బిజెపిలోకి మాజీ మంత్రి పుష్పలీల

By Pratap
|
Google Oneindia TeluguNews

Pushaleela
హైదరాబాద్: మాజీ మంత్రి పుష్పలీల కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు సిద్ధపడ్డారు. బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఆమె బిజెపిలో చేరనున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన పుష్పలీల కాంగ్రెసు అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆమె మంత్రిగా పనిచేశారు.

తెలంగాణపై స్పష్టత ఇవ్వనందుకే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పుష్పలీల చెప్పారు. దళితుల అభివృద్ధిపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కోసమేనని ఆమె సోమవారం వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆమె గతంలో విమర్శలు చేశారు. తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే ఉద్దేశంతోనే పుష్పలీల బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, కాంగ్రెసుతోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమని రాష్ట్ర మంత్రి జె. గీతా రెడ్డి అన్నారు. కాంగ్రెసులో ఉండే తెలంగాణ కోసం తాను పోరాటం చేస్తానని ఆమె సోమవారం మెదక్ జిల్లాలో అన్నారు. కాంగ్రెసు నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వెళ్లినంత మాత్రాన తెలంగాణ రాదని ఆమె అన్నారు.

English summary
Former minister and the Congress leader Pushaleela has decided to join in BJP. She criticised that Congress is not taling clear stand on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X