తెలంగాణ చిన్న విషయం కాదు: ఆజాద్, డిఎల్‌పై నో

రాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్‌లో ఏకాభిప్రాయం లేదన్నారు. అందుకే నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతోందని వెల్లడించారు. తాము తెలంగాణ ఇవ్వబోమని ఎప్పుడూ చెప్పలేదని, ఈ అంశానికి ఇంకా ముగింపు పలకలేదని గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రెండేసి రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. ఎపిలో అది ఇంత వరకు సాధ్యం కాలేదని చెప్పారు.
తెలంగాణ ఇవ్వడం లేదని తాము ఇంత వరకు ప్రకటించనందున ఎంపీలు పార్టీని వీడటంలో అర్థం లేదని చెప్పారు. ముందు చర్చలు పూర్తైతే ఆ తర్వాత తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ అంశం ముగిసిపోయిందని తామెప్పుడు చెప్పలేదన్నారు. తెరాసలో ఇద్దరు ఎంపీలు, ఓ మాజీ ఎంపి మాత్రమే చేరారన్నారు. ఇంకెవరూ ఆ పార్టీలో చేరటం లేదని, చేరినవాళ్లు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారన్నారు.
వారికి నిజంగా తెలంగాణ పట్ల ఆసక్తి ఉంటే పార్టీలోనే ఉండి పోరాడేవాళ్లన్నారు. తెలంగాణపై ఈలోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పలేమని, చర్చల తర్వాతే తుది నిర్ణయం గురించి ఆలోచన అన్నారు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్ గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications