డిఎల్ హీట్: సోనియాతో చిరంజీవి 45ని. భేటీ, వివరణ

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్ అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. డిఎల్ బర్తరఫ్‌ను చిరు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అలాగే తన వర్గం మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలపై చిరు వివరణ ఇచ్చారట. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన కూడా డిఎల్ బర్తరఫ్‌ను వ్యతిరేకిస్తున్నారు.
ఆయన ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తు పోకడలను వివరించారని అంటున్నారు. డిఎల్ రగడ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరకంగా చిరు, బొత్సలు అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేస్తున్నారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కిరణ్ కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల అంతర్గత సమావేశంలో పాల్గొన్న కిరణ్... ఆ తర్వాత ఆజాద్ వద్దకు వెళ్లి రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. సోనియాతో చిరు, ఆజాద్‌తో కిరణ్, ఢిల్లీలోనే బొత్స, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఉండటం, వరుసగా భేటీలు అవుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీలో వేడెక్కాయి.












Click it and Unblock the Notifications