ఎంసెట్ ఫలితాలు: ఇంజనీరింగ్, మెడికల్ ర్యాంకర్లు వీరే

హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 2 లక్షల 76 వేల 995 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2 లక్షల 1వేయి 308 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 72. 67 శాతం ఉత్తీర్ణులయ్యారు. మెడికల్ విభాగంలో 99 వేల 993 మంది పరీక్ష రాయగా, 80.79 శాతం మంది పాసయ్యారు. ఈ ఏడాది ఇంజనీరింగులో 50 వేల సీట్లు పెరిగాయని, 11 కళాశాలలు తగ్గాయని దామోదర రాజనర్సింహ చెప్పారు.

ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎంసెట్ - 2013లో ఇంజనీరింగ్ విభాగంలో ప్రకాశం జిల్లాకు చెందిన సాయి సందీప్ రెడ్డి మొదటి ర్యాంక్ సాధించాడు. ఇంజనీరింగ్ విభాగంలో విశాఖపట్నానికి చెందిన సుజన్ రెండో ర్యాంక్, కృష్ణా జిల్లాకు గోకుల్ మూడో ర్యాంక్, గుంటూరు జిల్లాకు చెందిన సాయికిరణ్ నాలుగో ర్యాంక్, విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోత్స్న ఐదో ర్యాంక్ సాధించారు.

హైదరాబాద్‌కు చెందిన వేముల వంశీకృష్ణ ఆరో ర్యాంక్, నల్లొండ జిల్లా మిర్యాలగుడాకు చెందిన వేగులు క్రాంతి ఏడో ర్యాంక్, ఖమ్మం జిల్లాకు చెందిన కందుల దినేష్ ఎనిమిదో ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన రవిచంద్ర తొమ్మిదో ర్యాంక్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బొడ్డా గౌరీశంకర్‌ పదో ర్యాంక్ సాధించారు.

Deputy CM Damodara Rajanarsimha

మెడికల్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన వెంకట వనీత్ మొదటి ర్యాంక్ సాధించాడు. మెడికల్ విభాగంలో విజయవాడకు చెందిన రోహిత్ కుమార్ రెండో ర్యాంక్ సాధించాడు. విజయవాడకే చెందిన జగదీష్ రెడ్డి మూడో ర్యాంక్ సాధించాడు. విశాఖకు చెందిన వెంకటేష్‌కు నాలుగో ర్యాంక్, వంరగల్‌కు చెందిన రిత్విక్‌కు ఐదో ర్యాంక్ వచ్చాయి.

కర్నూలు జిల్లాకు చెందిన అవుతు ప్రవీణ ఆరో ర్యాంక్, వరంగల్ జిల్లాకు చెందిన నోముల గౌతం రెడ్డి ఏడో ర్యాంక్, కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన సాయినాథం చిరంజీవి ఎనిమిదో ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన సూరపనేని ప్రజ్ఢ తొమ్మిదో ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన సుకుమార్ కల్వపూడి పదో ర్యాంక్ సాధించారు.

టాప్ ర్యాంకర్లలో ఎక్కువ మంది బాలురే ఉండడం విశేషం. ఉత్తీర్ణత విషయంలో కూడా బాలురే బాలికల మీద పైచేయి సాధించారు. ఈ నెల 17వ తేదీనుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. బి కెటగిరీ సీట్ల భర్తీ విషయంలో పారదర్సకంగా వ్యవహరిస్తామని, ఆన్‌లైన్ ద్వారానే భర్తీ చేస్తారని దామోదర రాజనర్సింహ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+