జైల్లో ధైర్యంగా జగన్: మేకపాటి, సాయి లొంగుబాటు

Mekapati Rajamohan Reddy - Vijaya Sai Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో ధైర్యంగా ఉన్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం అన్నారు. ఆయన తన తనయుడు గౌతం రెడ్డి, పేర్ని నానిలతో కలిసి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను మధ్యాహ్నం ములాకత్ సమయంలో కలిశారు.

అనంతరం మేకపాటి విలేకరులతో మాట్లాడారు. జగన్ కచ్చితంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన బయటకు వచ్చి తమ పార్టీకి, రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారన్నారు. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బర్తరఫ్, తదితర ఇతర సమస్యలతో అధికార కాంగ్రెసు పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా అదే విధంగా ఉందన్నారు. పార్టీని తాము బలోపంతే చేస్తామన్నారు.

సిబిఐ కోర్టుకు విజయ సాయి రెడ్డి

వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎ2 నిందితుడు విజయ సాయి రెడ్డి మధ్యాహ్నం సిబిఐ నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ఆయనకు కోర్టు 17వ తేది వరకు రిమాండ్ విధించింది. గతేడాది ఏప్రిల్ 13న బెయిల్ పొందిన విజయ సాయి రెడ్డికి సుప్రీం కోర్టులో ఇటీవల చుక్కెదురయింది. ఆయనను లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

మోపిదేవికి బెయిల్ వద్దు: సిబిఐ

మాజీ మంత్రి మోపిదేవి బెయిల్ పిటిషన్ పైన సిబిఐ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో కౌంటర్ వేసింది. మోపిదేవికి బెయిల్ ఇవ్వవద్దని కౌంటర్ పిటిషన్‌లో పేర్కొంది. వాన్‌పిక్ వ్యవహారంపై దర్యాఫ్తు కొనసాగుతుందని, ఈ దశలో మోపిదేవికి బెయిల్ ఇస్తే దర్యాఫ్తును ప్రభావితం చేసే అవకాశముందని సిబిఐ కోర్టుకు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+