ఏదో చెప్తే రాసేద్దామనా?: రాజకీయాలపై మహేష్ బాబు

రాజకీయాల్లోకి వస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. మహేష్ బాబు రానని సూటిగా చెప్పేశారు. అయితే విలేకరులు మాత్రం పదే పదే అదే విషాయాన్ని అడిగే ప్రయత్నాలు చేశారు. దీంతో అతను తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పానని, అయినా అదే విషయం పదే పదే అడుగుతున్నారని, తాను ఏదో ఒకటి చెబితే.. మీరు ఏదో ఒకటి రాసేద్దామనా అంటూ చమత్కరించారు.
తాను మరో పదేళ్ల వరకు టాలీవుడ్‌లోనే ఉంటానని, బాలీవుడ్‌కు వెళ్లనని చెప్పారు. తన సినిమాలను చూసి ఎవరు చెడిపోలేదని ఆయన అన్నారు. తనకు విజయవాడ కనకదుర్గమ్మ వారు అంటే చాలా ఇష్టమన్నారు. ఆమెకు తాను మొక్కుకున్నానని ఈ సందర్భంగా చెప్పారు.
మహేష్ బాబు మంత్రి గల్లా అరుణ కుమారికి బంధువైన విషయం తెలిసిందే. మహేష్ బాబు రాజకీయాల్లోకి వస్తారని పలుమార్లు ప్రచారం జరిగింది. కొంతకాలం క్రితం గల్లా అరుణ కుమారి... ప్రిన్స్‌ను రాజకీయాల్లోకి తీసుకు వస్తారని కూడా ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని ఆమె ఖండించారు.












Click it and Unblock the Notifications