కిరణ్ తీరుపై శంకర రావు ఆవేదన: డిఎల్ బల ప్రదర్శన!

ఈ సందర్భంగా మాట్లాడారు. ఎర్రచందనం అనుమతి పెద్ద కుంభకోణమని, అది 2జి కంటే పెద్దదని ఆయన పేర్కొన్నారు. డిఎల్‌ను బర్తరఫ్ చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ సామాజిక వర్గానికి కాంగ్రెసు దూరమవుతుందని ఆందోళన చెందారు. ఎర్రచందనం, డిఎల్ బర్తరఫ్ విషయంలో శంకర రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినే టార్గెట్ చేశారు.
డిఎల్ బలప్రదర్శన
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బుధవారం మధ్యాహ్నం తన సొంత నియోజకవర్గం మైదుకూరుకు బయలుదేరారు. బర్తరఫ్ అనంతరం ఆయన మొదటిసారి కడపకు వెళ్తున్నారు. ఆయనకు ఆహ్వానం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. 'మీ వెంటే మేము' అంటూ అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. డిఎల్ అనుచరులు ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లలో డిఎల్ తప్ప కాంగ్రెసు నేతలు, సోనియా గాంధీ బొమ్మ గానీ లేదు. ఇది చర్చనీయాంశమైంది.
చాగలమర్రి నుండి మైదుకూరు వరకు భారీ ర్యాలీతో వెళతారు. అక్కడ సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడతారు. ర్యాలీ, బహిరంగ సభల ద్వారా డిఎల్ బల ప్రదర్శన చేయాలనే ఆలోచనలతో ఉన్నట్లుగా చెబుతున్నారు.
జైలులో జగన్‌ను కలిసిన మేకపాటి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం చంచల్‌గూడ జైలులో కలిశారు. జగన్‌ను కలిసిన వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన తనయుడు గౌతం రెడ్డి, ఎమ్మెల్యే పేర్ని నాని ఉన్నారు.












Click it and Unblock the Notifications