విప్ ధిక్కరణ: ముందే జగన్‌వర్గం, 'టి' ఎమ్మెల్యేలపై వేటు

ఈ విప్‌ను తెలంగాణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుకూల ఎమ్మెల్యేలు 18 మంది ఉల్లంఘించారు. వారిపై విచారణ కొనసాగుతోంది. ఈ నెల 10వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల విషయంలో సమావేశాల కంటే ముందే నిర్ణయం వెల్లడించే అవకాశాలున్నాయి. అయితే పార్టీలు అందించిన అనర్హత పిటిషన్ల ఆధారంగా చర్యలుంటాయా? లేక రాజీనామాలు ఆమోదిస్తారా అనేది సందిగ్ధంగా మారింది.
అంతేకాకుండా అందరి పైన వేటు పడుతుందా అనేది కూడా అనుమానమే. టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చిన్నం రామకోటయ్య, సముద్రాల వేణుగోపాల చారిలు తమకు పార్టీ విప్ అందలేదని స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరిపై వేటు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ఉప ఎన్నికలు లేనట్లే!
ఎమ్మెల్యేల అనర్హులుగా ప్రకటించినా ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. సభ్యుల పదవీకాలం ఏడాదిలోపు ఖాళీ అయ్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించకూడదన్న నిబంధన ఉంది. జూన్ 3వ తేదితో ఏడాది గడువు ముగిసింది. దీంతో వీరిపై వేటు వేసినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications