'టి' అనుకూల పొత్తు: వెంకయ్య, బెదిరింపులన్న కోదండ

జెఏసి నేతలకు బెదిరింపు కాల్స్: కోదండరామ్
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చైర్మన్ కోదండరామ్ వేరుగా అన్నారు. ఆటంకాలు ఎదిరించి తాము ఛలో అసెంబ్లీని విజయవంతం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అడ్డుంకులు సృష్టించినా తాము ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు పూటకో మాట చెబుతోందని మండిపడ్డారు. తెలంగాణపై ఆ పార్టీ సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉందన్నారు.
అనుకూలమని చెప్పారా?: కడియం
తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయదని తెలిసే తాను ఆ పార్టీని వీడానని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కడియం శ్రీహరి మెదక్ జిల్లాలో అన్నారు. తమ పార్టీ 2009 నాటి లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పడం తప్పితే అనుకూలమని ఎప్పుడైనా ప్రకటించారా అని ప్రశ్నించారు.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అవిశ్వాసం పేరుతో రాజకీయ డ్రామా ఆడుతోందన్నారు. అధి ప్రజలను మోసం చేసే దుర్మార్గమన్నారు. కాగా, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు డెడ్ లైన్లు హెడ్ లైన్ల కోసమేనని మంత్రి బసవరాజు సారయ్య వరంగల్ జిల్లాలో ఎద్దేవా చేశారు.
తెలంగాణ వ్యతిరేకులకే నిధులు: వివేక్
తెలంగాణను వ్యతిరేకించే ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిధులు ఇస్తున్నారని పెద్దపల్లి ఎంపి వివేక్ ఆరోపించారు. ఓట్ల కోసమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జై తెలంగాణ అంటున్నారని, సీమాంధ్ర పార్టీలని తరిమేయాలని ఈటెల రాజేందర్ అన్నారు.












Click it and Unblock the Notifications