జగన్ టార్గెట్: జైల్లో పాలిటిక్స్‌పై షిండేకు యనమల లేఖ

కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు చంచల్‌గూడ జైలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజభోగాలు అనుభవిస్తున్నారని, జైలులోనే రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, జైలును పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యనమల చంచల్‌గూడ జైలులోని అక్రమాలపై విచారణ జరిపించాలని హోంమంత్రికి లేఖ రాశారు.
బెయిల్ స్కాం: కోర్టుకు గాలి
బెయిల్ కుంభకోణం కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని జైలు అధికారులు బుధవారం ఉదయం ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. ఓఎంసి కేసులో అరెస్టైన గాలికి బెయిల్ ఇప్పించేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయనే అభియోగాలపై పలువురు అరెస్టైన విషయం తెలిసిందే.
నక్సల్స్ ప్రభావం తగ్గించాం: కిరణ్
న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ప్రణాళికాబద్ధ చర్యలతో పోలీసులు తమ రాష్ట్రంలో నక్సలిజాన్ని తగ్గించారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలు నక్సలిజం వైపు ప్రభావితం కాకుండా ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కలిసి పని చేయడం వల్ల నక్సల్స్ ప్రభావాన్ని తగ్గించామన్నారు.
ఈ సందర్భంగా మఖ్యమంత్రి కేంద్రం నుండి నిధులు కోరారు. హైదరాబాదులో ప్రత్యేక నిఘా కోసం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దులలో రోడ్డు నిర్మాణం కోసం కేంద్రం సాయం కోరారు. ఇప్పటికే పంపిన ప్రతిపాదనలను అంగీకరించాలన్నారు. డయల్ 100 కోసం కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications