15 సీట్లతో తెలంగాణ, కత్తి మాకే ఇవ్వండి: కెసిఆర్

K Chandrasekhar Rao
నల్లగొండ: తమకు 15 లోకసభ స్థానాలు ఇస్తే తెలంగాణ సాధిస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తమకు వంద శానససభా స్థానాలు, 16 లోకసభ స్థానాలు గెలిచే సత్తా ఉందని ఆయన అన్నారు. మోకాళ్లపై యాత్రలు చేసినా సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లా కోదాడలో జరిగిన శిక్షణా శిబిరంలో ఆయన బుధవారం మాట్లాడారు. తమ పార్టీ దెబ్బకు సీమాంధ్ర పార్టీల పీఠాలు కదిలిపోతున్నాయని ఆయన అన్నారు.

ఏ జాతీయ పార్టీకి కూడా కేంద్రంలో పూర్తి మెజారిటీ రాదని, తమకు 15 సీట్లు వస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధిస్తామని ఆయన అన్నారు. కేంద్రం దిగి వచ్చి తెలంగాణ ఇచ్చే పరిస్థితిని కల్పిస్తామని అన్నారు. ఆంధ్రలో మూడు ముక్కలాట నడుస్తోందని కెసిఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పారు.

తమ పార్టీ లేకుంటే కాగ్రెసు, తెలుగుదేశం, బిజెపి తెలంగాణ ప్రస్తావన తెచ్చేవి కావని ఆయన అన్నారు. యుద్ధం చేసేవాడికి కత్తి ఇవ్వాలని ఆయన సూచించారు. సీమాంధ్ర పార్టీలకు ఓట్లు వేసి తమను కొట్లాడమంటే ఎలా అని ఆయన అడిగారు. వచ్చిన తెలంగాణను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే అడ్డుకున్నారని ఆయన అన్నారు. ఆంధ్ర పార్టీలన్నీ కలిసి తెలంగాణను అడ్డుకున్నాయని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే రాజకీయ ప్రక్రియలో ముందుంటామని ఆయన చెప్పారు. మనం చేస్తోంది చిల్లరమల్లర పోరాటం కాదని, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమని ఆయన అన్నారు. తెలంగాణకు ఆంధ్ర పార్టీల పెత్తనం అవసరం లేదని, సీమాంధ్ర పార్టీల్లో తెలంగామ వ్యక్తి పార్టీ అధ్యక్షుడవుతాడా అని ఆయన అన్నారు.

తెలంగాణకే పరిమితం కావాల్సిన నాగార్జునసాగర్ నీళ్లను మన నోళ్లను కొట్టి ఆంధ్రాకు తరలించుకుని పోతున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+