బైపోల్స్: నితీష్‌పై లాలూ పైచేయి, మోడీకి సిబాల్ కౌంటర్

ఉప ఎన్నికల్లో గుజరాత్‌లోని పోరుబందర్, బనస్కంత పార్లమెంటు స్థానాలలో అధికార భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. నాలుగు అసెంబ్లీ స్థానాలను కూడా బిజెపి గెలుచుకుంది. నితీష్‌కు మాత్రం లోకసభ ఎన్నికల ముందు ఎదురు దెబ్బ తగిలింది. మహారాజ్‌గంజ్ లోకసభ స్థానాన్ని ఆర్జెడి కైవసం చేసుకుంది. జెడి(యు) అభ్యర్థి పికె షాలిని ఆర్జెడి అభ్యర్థి ప్రభుసింగ్ ఓడించారు.
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికలలో... హోరా నుండి పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెసు అభ్యర్థి ప్రసూన్ బెనర్జీ గెలుపొందారు. ఉత్తర ప్రదేశ్‌లోని హండియా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి ప్రశాంత్ సింగ్ ముందంజలో ఉన్నారు.
ఉప ఎన్నికల ఫలితాలపై నరేంద్ర మోడీ స్పందించారు. అంతర్గత భద్రత పైన కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలలో బిజెపి గెలుపు కేంద్రానికి ఓ హెచ్చరిక అన్నారు. కాంగ్రెసు అధ్వాన్న పాలనకు ఈ ఉప ఎన్నికలు నిదర్శనమన్నారు. మోడీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కపిల్ సిబాల్ కౌంటర్ ఇచ్చారు. టెర్రరిజంలో అనుభవం ఉన్న మోడీ సలహాలు తమకు అవసరమే అన్నారు.












Click it and Unblock the Notifications