ధోనీ, పాండేలది ఏళ్ల నాటి బంధం: సాక్షితో మ్యాచ్‌లు..!

వారణాసికి చెందిన అరుణ్ పాండే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా బీహార్ తరఫున రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అదే సమయంలో ధోనీతో అతనికి పరిచయం ఏర్పడింది. కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తున్న దశలో ధోని ఢిల్లీకి వచ్చి కొన్ని చిన్న చిన్న టోర్నీలలో ఆడేవాడు. అప్పుడు పాండే ఇంట్లోనే ధోనీ ఉండేవాడట. ఆ తర్వాత ఎయిరిండియా జట్టుకు వీరిద్దరి కలిసి ఆడారు. వీరి స్నేహం మరింత బలపడింది.
ధోనీ స్టార్‌గా మారిన తర్వాత తన మిత్రుడిని మరిచిపోకుండా ఆదరించాడంటున్నారు. ధోనీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే పాండే, రితీ స్పోర్ట్స్ కంపెనీతో దూసుకు వచ్చాడట. ఏజెంట్ పాత్రే అయినా.. వారిద్దరి మధ్య అనుబంధం అంతకంటే ఎక్కువే అంటున్నారు. ధోనీ తర్వాత మిగిలిన క్రికెటర్లతోను స్నేహం కుదిరింది. అందరు అతడిని ఏజెంట్ పాండే అని పిలుస్తారట.
ఆ తర్వాత ధోనీతో పాండే రూ.210 కోట్ల డీల్ కుదుర్చుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అది ధోనీ కంపెనీయేనని, పేరుకే పాండేనే ముందున్నాడని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు రితీ స్పోర్ట్స్ వివాదాస్పదమైంది. మరోవైపు పాండే మాత్రం రితీ స్పోర్ట్స్‌తో ధోనీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ధోనీ భార్యతో కలిసి అరుణ్ పాండే మ్యాచ్ చూసిన సందర్భాలు కూడా ఉన్నాయట.












Click it and Unblock the Notifications