దుమారం: బిజినెస్ లింక్స్‌పై పెదవి విప్పని ధోనీ

రితీ స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థలో ఆయన 15 శాతం వాటా ఉన్నట్లు, మరో నలుగురు క్రికెటర్లను ఆ సంస్థ ఎండార్స్ చేస్తుందని దేశంలోని ఓ ప్రముఖ బిజినెస్ పత్రిక రాసింది. ఆ వార్తాకథనం ప్రకారం - భారత జట్టు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల కెప్టెన్‌గా వ్యవహరించే ధోనీ అనుచిత ప్రయోజనాలు పనిచేస్తాయని అంటున్నారు.
జాతీయ కెప్టెన్‌గా జట్టు ఎంపికలో ధోనీ పాత్ర ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపియల్ ఫ్రాంచైజీ యజమాని ఇండియన్ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ధోనీ ఉన్నాడు. తుది జట్టులోకి వచ్చే 11 మంది ఆటగాళ్లను కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్ కలిసి ఎంపిక చేస్తారు దీంతో ధోనీ కంపెనీ మేనేజ్ చేసే అటగాళ్లకు ఇందులో అనుచిత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని మాజీ భారత క్రికెటర్ మనీందర్ సింగ్ అన్నట్లు ఆ పత్రిక రాసింది.
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై కూడా మాట్లాడడానికి ధోనీ గతవారం నిరాకరించాడు. సమయం వచ్చినప్పుడు తాను దానిపై మాట్లాడుతానని తప్పించుకున్నాడు. రితీ స్పోర్ట్స్‌తో ధోనీకి విడదీయరాని సంబంధం ఉందని, ఆ సంస్థతో వ్యాపార సంబంధాలున్నాయని బుధవారంనాడు మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications