మొక్కుబడి భేటీకి రాను: జయలలిత, మమత డుమ్మా

ఏటా ఇదో లాంఛనంగా తయారైందే తప్ప ఫలితమేమీ లేదని జయలలిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భేటీలో 12 చర్చనీయాంశాల శీర్షికలు చదవడానికే పది నిమిషాలు పడుతుందని, వాటిపై ప్రసంగానికీ అంతే సమయం కేటాయించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలా ముఖ్యమంత్రుల గొంతు నొక్కేస్తుంటే, తాము హాజరై ఫలితమేమిటని నిర్వేదం వ్యక్తం చేశారు. కాబట్టి తన బదులు పురపాలక శాఖ మంత్రి మునుస్వామిని పంపుతున్నట్లు తెలిపారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ భేటీకి వెళ్లడం లేదని ఆ రాష్ట్ర సచివాలయవర్గాలు వెల్లడించాయి. మరోవైపు జయలలిత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ ధ్వజమెత్తారు. తగినంత సమయం ఇవ్వరన్నది సాకు మాత్రమే తప్ప ఎంతో ముఖ్యమైన సమావేశానికి గైర్హాజరయ్యేందుకు తగిన కారణం కాదని ఆయన చెప్పారు.
భేటీకి కిరణ్
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల ఉనికి లేదని సిఎంల భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి వివరించనున్నారు. ఆయనతోపాటు డిజిపి దినేష్ రెడ్డి కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు ఉమ్మడి దాడులు చేస్తే ఉత్తమమని వారు ఈ సందర్భంగా తెలపనున్నారు.












Click it and Unblock the Notifications