గతంలో ఆత్మహత్యయత్నం చేసిన జియా ఖాన్

బాయ్‌ఫ్రెండ్‌తో గొడవల కారణంగా ఆమె డిప్రెషన్‌కు గురైందని చెబుతున్నారు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా వెంటాడినట్లు ప్రచారం సాగుతోంది. సూరజ్ పంచోలీతో సంబంధాలపై తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని జియా ఖాన్ తల్లి రబియా చెప్పింది. కొద్ది నెలలుగా జియా ఖాన్ డిప్రెషన్‌తో బాధపడుతోందని ఆమె చెప్పింది.
మూడేళ్లుగా సినిమాల్లో నటించే అవకాశాలు రాకపోవడంతో జియాఖాన్ తీవ్ర నిరాశకు గురైందని పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్యకు అది కారణం కావచ్చునని అంటున్నారు. ఉరివేసుకోవడం వల్లనే జియా ఖాన్ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. గొంతుపై ఉరేసుకున్న గుర్తులు తప్ప ఆమె దేహంపై ఏ విధమైన గాయాలు లేవని వైద్యులు తేల్చారు.
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మద్యం సేవించిందా, డ్రగ్స్ ఏమైనా తీసుకుందా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని వైద్యులు అంటున్నారు జియా ఖాన్ రాత్రి పది, అర్థరాత్రి మధ్య మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమెను ఆత్మహత్యకు వేరొకరు ప్రేరేపించిన ఆనవాళ్లు లేవని అదనపు పోలీసు కమిషనర్ విశ్వాసా నంగ్రే పాటిల్ అన్నారు. ఆత్మహత్యకు ముందు చివరిసారిగా జియా ఖాన్ సూరజ్‌తో మాట్లాడిందని, దీంతో తాము సూరజ్ వాంగ్మూలాన్ని రికార్డు చేశామని ఆయన చెప్పారు.
తాము జియా ఖాన్ ల్యాప్‌టాప్‌ను, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మెసేజ్‌లను, కాల్ రికార్డులను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఈ మెయిల్ ఖాతాలను, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను కూడా పరిశీలిస్తామని అన్నారు.
సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలీ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అంజూ మహేంద్రూ, ఆదిత్య పంచోలీలతో కలిసి ఆ రోజు రబియా డిన్నర్‌కు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి కూతురు జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications