టికెట్ల ఆరోపణలు: రత్నాకర్ శెట్టిపై ఐదేళ్ల నిషేధం

Ratnakar Shetty
ముంబై: బిసిసిఐ చీఫ్ అడ్మినిస్ట్రేటి వ్ అధికారి రత్నాకర్ శెట్టిపై ముంబై క్రికె ట్ సంఘం (ఎంసిఏ) ఐదేళ్ల నిషేధం విధించింది. 2018 వరకూ అసోసియేషన్‌కు సం బంధించిన ఎటువంటి కార్యకలాపాల్లోనూ శెట్టి పాల్గొనకూడదని స్పష్టం చేసింది. అ

హ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నిరుడు డిసెంబర్‌లో జరిగిన టీ-20 మ్యాచ్ టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌లో కొందరు ఎంసిఎ ఆఫీస్ బేరర్ల హస్తం ఉందని రత్నాకర్ శెట్టి ఆరోపించారు. ఎంసీఏ వార్షిక సమావేశంలో శెట్టి చేసిన ఈ ఆరోపణలపై తాము విచారణ జరిపించామని, అతని ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిందని ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు రవి సావంత్ అన్నారు. అందుకే అతనిపై నిషేధం విధించామని ఆయన చెప్పారు.

ఈ ఐదేళ్ల నిషేధ కాలంలో శెట్టి అసోసియేషన్ ఎన్నిక ల్లో పోటీ చేయకూడదని, ఇతర వ్యవహారాలకు దూరంగా ఉండాల్సి వుంటుంది. రత్నాకర్ శెట్టిపై నిషేదం 2018 జూన్ 2వ తేదీన పూర్తవుతుంది. కాగా తనను అన్యాయంగా నిషేధించారని, దీన్ని కోర్టులోనే తేల్చుకుంటానని శెట్టి చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఇష్టంలేని కొందరు వ్యక్తులు ఈ పని చేశారని ఆయన అన్నారు. వ్యక్తిగత కక్ష కారణంగా కొంత మంది వ్యక్తులు తనపై ఈ చర్యకు ఒడిగట్టారని ఆయన ఆరోపించారు. తనపై నిషేధం విధించడాన్ని ఆయన అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+