ఎన్‌సిటిసి వివాదం: నరేంద్ర మోడీ వర్సెస్ చిదంబరం

కేంద్ర హోంశాఖను నిర్వహించినప్పుడు ఎన్‌సిటిసిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన చిదంబరం మోడీకి బదులిచ్చారు. కొత్త కొత్త సంస్థలేమీ పెట్టడం లేదని ఆయన అన్నారు. తాము మల్టీ ఏజెన్సీ సెంటర్ పెట్టామని, దాన్ని మోడీ ప్రశంసించారని, ఎన్ఐఎ పెడితే ఇప్పుడు ప్రతి రాష్ట్రమూఇప్పుడు ఎన్ఐఎ కావాలని అంటోందని ఆయన అన్నారు. ఇప్పటికీ ఇంకా కొంత మంది ముఖ్యమంత్రులు ఎన్‌సిటిసిని వ్యతిరేకించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రూపంలో ఎన్‌సిటిసిని అంగీకరించకపోతే దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.
నక్సల్స్‌తో ఇక పోరాటమేనని, చర్చల ప్రసక్తే లేదని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అన్నారు. అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఇటీవల చేసిన దాడి చర్చల ప్రస్తావనకు వీలు లేకుండా చేసిందని ఆయన అన్నారు. ఇలాంటి సంఘవిద్రోహ శక్తులతో రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ పోరాడుతున్నామని, ఇక ముందుకూడా పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
మావోయిస్టులను ఎదుర్కునేందుకు అదనపు బలగాలు కావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని కోరారు. రెండు అదనపు సిఆర్పీఎఫ్ బలగాలు, మిలటరీ హెలికాప్టర్ ఇవ్వాలని ఆయన అడిగారు. అంతర్గత భద్రతపై ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన ఈ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications