స్నేహితుడి కొడుకు: జగన్ మీద పోటీపై డిఎల్ ఆవేదన

YS Jagan - DL Ravindra Reddy
కడప: మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గానికి చేరుకున్న డిఎల్ దువ్వూరు నుంచి ఖాజీపేట వరకు ర్యాలీ నిర్వహించి, ఆయా చోట్ల బహిరంగ సభలలో ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పని చేస్తున్నారని ఆరోపించారు. తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని అడిగితే బాగుండేదని, కనీసం ఆయన అడగకపోయినా ఆయన చెంచా వీరశివా రెడ్డి వారి ద్వారా అడిగించినా ఎడమ చేత్తో రాజీనామా చేసి ఇచ్చేవాడినని అన్నారు.

సొంత జిల్లాలో కనీసం కార్యకర్తలతో పరిచయం లేని, గాంధీ బొమ్మను కూడా చూడని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. పదవిలో ఉండేది నాలుగు రోజులేనని, అందుకే ముఖ్యమంత్రి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రులు సి.రామచంద్రయ్య, వట్టి వసంత కుమార్, బొత్స సత్యనారాయణ, జానా రెడ్డిలను భయపెట్టేందుకు తనను డిస్మిస్ చేశారన్నారు.

గత ఉప ఎన్నికల్లో అధిష్ఠానం తనపై ఒత్తిడి తెచ్చి, తన ప్రాణస్నేహితుడు వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేయించి తనను బలిపశువును చేసిందన్నారు. ముఖ్యమంత్రిలా కుట్రతో కాంగ్రెస్‌లో ఎవరిని చంపాలి, భూస్థాపితం చేయాలన్న ఆలోచన తనది కాదన్నారు. రాత్రి ఒంటిగంట వరకు ఇంట్లో కూర్చుని కుట్రలకు పాల్పడే తత్వం తనది కాదని, ఈ అసమర్థ, అవినీతి సిఎం దగ్గర మంత్రిగా పని చేయలేనంటూ 15 నెలల కిందటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపానని చెప్పారు.

ఈ కుట్రల సిఎం చెప్పే మాటలు వినకుండా, రాష్ట్రంలో పార్టీని బతికించాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. కిరణ్ మనసుమార్చుకొని పార్టీని బతికిస్తే 2014 ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తానని, అదే సమయంలో అవినీతి మరకలైన మట్కా చేతులతో, చెడిపోయిన వారిచేత టికెట్టు ఇప్పించుకోవాల్సిన దుస్థితిలో లేననన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపి తర్వాత నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను కలుస్తానని, వారి అభీష్టం మేరకు పార్టీలో కొనసాగడమా? లేదా? వేరే పార్టీలో చేరడమా అన్నది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+