ఒక్కటిగా వెళ్లేదిలేదు: దాడితో కలవనని చెప్పిన కొణతాల

దాడి వీరభద్ర రావు తమ పార్టీలో చేరినా ఆయనతో కలిసి పని చేయనని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అలంభిస్తోందని మండిపడ్డారు. పోలవరం పూర్తయితే 31 లక్షల హెక్టార్ల సాగు భూమికి నీరు అందుతుందని ఆయన అన్నారు.
కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో ఆమె కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 'కాంగ్రెస్, టిడిపిలు కుట్రలు పన్ని, కుతంత్రాలు చేసి సీబీఐని వాడుకొని అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలుపాలు చేశాయి.
అన్యాయంగా ఏడాది కాలంగా ఆయనను నాలుగు గోడల మధ్య బంధించాయి. కానీ త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యం నిర్మించే దిశగా మనందరినీ నడిపిస్తారు. జగన్ తీసుకు వచ్చే సుభిక్షమైన రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్సార్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని' ఆమె విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications