నెలలో తెలంగాణ వస్తే తల నరుక్కుంటా: కెకె

K Keshav Rao
కరీంనగర్: కాంగ్రెసు తెలంగాణ ఇవ్వదని తేలిన తర్వాతనే తాము ఆ పార్టీని వీడామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కె. కేశవ రావు అన్నారు. తనలో మానవత్వం ఉంది కాబట్టే తెరాసలో చేరానని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతులు చెప్పినట్లు నెలలో తెలంగాణ వస్తే తల నరుక్కుంటానని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా మంథనిలో నిర్వహించిన పార్టీ శిక్షణా శిబిరంలో కెసిఆర్‌, వివేక్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్ బాబుకు బుద్ధి లేదని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన అహంకారపూరితమైన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు స్పందించలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవనన్న ముఖ్యమంత్రిని కాంగ్రెసు తెలంగాణ నేతలు ఖండించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

తెలంగాణ ఏర్పడితే గోదావరి వెంబడి కొత్తగా 10 విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సింగరేణి బొగ్గు గనుల ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు.

ఇదిలావుంటే, తెలగాణలో జరిగిన ఆత్మహత్యలపై శానససభలో చర్చించాలని బిజెపి నేత నాగం జనార్దన్ రెడ్డి గురువారం హైదరాబాదులో డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్నిశానససభ విస్మరించడం తగదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ నెల 14వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పారు.

ఓట్లు, సీట్లే తెరాస ఎజెండా అని, తెలంగాణ సాధనలో తెరాకు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. యుపిఎ తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని ఆయన అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తుందని ఆయన చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రతిపాదించేలా కాంగ్రెసును నిలదీయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+