కెసిఆర్‌తో విసుగెత్తిపోయారు: ఎర్రబెల్లి, నాగంకు అండగా..

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు గురువారం మండిపడ్డారు. ఎలక్షన్లు, కలక్షన్లతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టవద్దని హితువు పలికారు.

ఇదిగో తెలంగాణ... అదిగో తెలంగాణ అంటూ... కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణపై దగాకోరు మాటలను మానుకోవాలన్నారు. కెసిఆర్ మాటలు, హామీలతో తెలంగాణ ప్రజలు ఎప్పుడో విసుగెత్తిపోయారన్నారు. తెరాసకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించగలరా అని ప్రశ్నించారు.

కాగా తెరాస వల్లనే అందరూ తెలంగాణ వాదం ఎత్తుకున్నారన్న కెసిఆర్ వ్యాఖ్యలపై నాగం జనార్ధన్ రెడ్డి రెండు రోజుల క్రితం స్పందిస్తూ... 1969లో కెసిఆర్ అడ్రస్ ఎక్కడని, 2001లో కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని అనుకుంటున్నారని, ఆయన నెక్కరు వేసుకోనప్పుడే తాము జైళ్లకు వెళ్లామని కౌంటర్ ఇచ్చారు.

తెలివిగా ఓటు హక్కు వినియోగించుకోండి: లక్ష్మణ్

పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రజలు తెలివిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బిజెపి మినహా ఏ పార్టీకి ఓటు వేసినా కాంగ్రెస్ ఖాతాలోకే వెళుతుందని ఆయన వేరుగా వ్యాఖ్యానించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బిసి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్ల వల్ల బిసిలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+