సంకెళ్లు వేసి తండ్రిని కట్టిపడేశాడు: అతను ఆంధ్రుడు

90-year-old chained by sons for being ‘unclean’
బెంగళూర్: కూతురిని నెలల తరబడి గదిలో బంధించిన ఉదంతాన్ని మరిచిపోక ముందే కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో మరో దారుణం వెలుగు చూసింది. కన్న కొడుకు తన తండ్రిని సంకెళ్లతో కట్టిపడేశాడు. బెంగళూర్‌లోని బానశంకరిలో ఈ సంఘటన బుధవారం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనంతరామశెట్టి (90) అనే వ్యక్తికి ఆ దుస్థితి పట్టింది. అతను 1973లో బెంగళూర్ వచ్చి వ్యాపారం ప్రారంభించాడు.

ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య లేదని చెప్పారు. ఏడు నెలలుగా అతన్ని కుమారుడు టెర్రాస్‌ మీద సంకెళ్లు వేసి కట్టిపడేశాడు. తన తండ్రి శుభ్రంగా ఉండడని, స్నానం చేయడని కుమారుడు చెబుతున్నారు. అనంతరామశెట్టికి బెంగళూర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించారు.

స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటకు వచ్చింది. అతని కట్టి పడేసిన స్థలంలో దుర్వాసన వస్తోందని, అనారోగ్యకరమైన పరిస్థితి ఉందని పోలీసులు చెప్పారు. తన తండ్రిని అలా కట్టిపడేస్తున్న విషయాన్ని అతని కుమారుడు సురేష్ హనుమంతయ్య శెట్టి అంగీకరించాడు.

ఇంటిని అశుద్ధం చేస్తున్నాడని, దాంతో ప్రతి రోజూ పొద్దున అతన్ని కట్టి పడేసి, రాత్రి ఇంట్లోకి తీసుకుని వెళ్తామని అతను చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఉదయం పూట స్నానం చేయిస్తామని, రోజుకు మూడు పూటల తిండి పెడతామని చెప్పాడు.

తమ మామ మంచికోసమే అలా కట్టిపడేస్తున్నామని అనంతరామశెట్టి కోడలు కల్పన అంటోంది. ఇంటిని అశుద్ధం చేస్తున్నాడని, తరుచూ డయేరియాతో బాధపడుతుంటాడని ఆమె చెప్పింది. మెట్ల మీంచి జారిపడతాడనే భయంతోనే అలా కట్టి పడేస్తున్నామని, ఆరు నెలల క్రితం ఓసారి అలా పడ్డాడని ఆమె చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+