సబిత, ధర్మానల కస్టడీకి మెమో: ఫ్యామిలీతో జగన్

తప్పుపట్టిన సిబిఐ
తాము కేసు నుండి బయటపడతామన్న సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావుల వ్యాఖ్యలను సిబిఐ తప్పు పట్టింది. వారు కోర్టులను ప్రభావితం చేస్తారనేందుకు వారి వ్యాఖ్యలే నిదర్శనమని కోర్టుకు సిబిఐ తరఫు న్యాయవాది తెలిపారు. కేసు దర్యాఫ్తులో ఉండగా కేసు నుండి బయటపడతామని ఎలా చెబుతారని సిబిఐ న్యాయవాది వాదించారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సిడిని సిబిఐ కోర్టుకు ఇచ్చింది.
కుటుంబంతో మాట్లాడేందుకు జగన్‌కు అనుమతి
ఈ కేసులో దాల్మియా ఛార్జీషీటుపై విచారణను కోర్టు వాయిదా వేసింది. జగన్ తదితరుల రిమాండును కోర్టు ఈ నెల 21వ తేది వరకు పొడిగించింది. కోర్టుకు వచ్చిన తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు జగన్‌కు గంటపాటు అనుమతించారు. పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవచ్చుని సూచించింది.
సిబిఐ తరఫున సురేంద్ర
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులపై వాదించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సురేంద్రను సిబిఐ నియమించింది. ఇప్పటి వరకు సురేంద్ర సత్యం కుంభకోణం కేసులో సిబిఐ తరఫున వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications