డిఎల్ బర్తరఫ్ ఊహించిందే, కెబినెట్ సిఎం ఇష్టం: జెసి

ఎప్పుడైనా పిసిసి కొత్త కార్యవర్గం
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కొత్త కార్యవర్గం ఎప్పుడైనా ప్రకటించే అవకాశముందని ఏఐసిసి కార్యదర్శి కృష్ణమూర్తి శుక్రవారం హైదరాబాదులో అన్నారు. ఆయన గాంధీ భవన్‌లో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యవర్గం ఎప్పుడైనా ఉంటుందన్నారు. మంత్రివర్గంలో ఎవరిని ఉంచాలనేది కిరణ్ నిర్ణయమే అన్నారు.
కాగా అంతకుముందు హైదరాబాదులో తెలంగాణపై ఇచ్చిన మాటను తప్పితే పార్టీ చరిత్రకే మచ్చ అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.తెలంగాణను కేంద్రం ఇవ్వని పక్షంలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఇచ్చిన మాటపై జాప్యమెందుకని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
చేప ప్రసాదం విషయంలో లోకాయుక్త పరిధికి మించి మాట్లాడుతోందని, కోట్లాది రూపాయల అవినీతి జరుగుతుంటే కనిపించడం లేదా అని, ప్రసాద పంపిణీ సమయంలో ఏదైనా జరిగితే లోకాయుక్తనే బాధ్యత వహించాలని పొన్నం మండిపడ్డారు.












Click it and Unblock the Notifications