జగన్‌కు రక్త పరీక్షకు సిద్ధం, భార్యతో మాట్లాడొద్దా: సురేఖ

జగన్‌కు వైద్య పరీక్షలు చేయిద్దాం సిద్ధమా? అని ఆమె టిడిపికి సవాలు విసిరారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి దారుణమైన రాజకీయాలు చూడలేదన్నారు. అధికార పార్టీతో కుమ్మక్కయిన ప్రతిపక్షం ఆడుతున్న అబద్ధాలుగానీ, ఇంతటి దారుణమైన రాజకీయాలుగానీ తన జీవితంలో చూడలేదని, ఒక వ్యక్తిని లక్ష్యంగా పెట్టుకుని, కాంగ్రెస్, టిడిపి కలిసి కోర్టు దాకా వెళ్లి కేసులు వేశాయన్నారు. జగన్ మీద పిల్ వేస్తే.. అందులో జగన్‌ను 52వ ప్రతివాదిగా పేర్కొంటే.. 1 నుంచి 15 వరకు ప్రభుత్వం, ప్రభుత్వ విభాగాలే ప్రతివాదులుగా ఉన్నాయన్నారు.
ఇందుకు సంబంధించి కోర్టు సమన్లు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. జగన్ కాంగ్రెసు పార్టీని వీడాకే కక్ష సాధింపు ప్రారంభమైందన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కాలం 2004 నుంచి 2009 వరకని, ఆ సమయంలో జగన్ ఎలాంటి రాజకీయ పదవిలో లేరని, ఎవరిని ఫోన్ ద్వారా కూడా సంప్రదించలేదన్నారు. జగన్‌ను హింసించడమే కాకుండా, ఆయనపై కేసులు వేయడమే కాకుండా, సిబిఐ ద్వారా ఘోరమైన ఆరోపణలు చేయిస్తున్నారన్నారు.
చట్ట ప్రకారం ఏ వ్యక్తికైనా మూడు నెలల లోపు బెయిల్ ఇవ్వాలని చట్టం చెబుతోంది. అయినా ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడన్న దొంగ సాకు చూపి అధికారంలో లేని, అధికారపక్షంతో పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిని, ఒక ఎంపీని, 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలున్న ఒక పార్టీ అధ్యక్షుడిని ఏడాదికి పైగా జైల్లో పెట్టారు. మద్యం అని, నీలి చిత్రాలు అని దిగజారుడు మాటలు ఎన్నెన్నో మాట్లాడుతున్నారని, తాను సవాల్ విసురుతున్నాని, జగన్‌కు రక్ష పరీక్షలు చేయిద్దామా అన్నారు. చంద్రబాబు మద్దతు లేకుండా ఈ ప్రభుత్వం కొనసాగడం లేదని ఆరోపించారు. ఆయన తన భార్యాబిడ్డలతో మాట్లాడటం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications