వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టుకు జగన్, సబిత: విజయ సాయికి స్పెషల్ కేటగిరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Sabitha Indra Reddy
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిలు ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను అధికారులు కోర్టు ఎదుట ప్రవేశ పెట్టనున్నారు.

సబిత కూడా హాజరవుతారు. దాల్మియా అంశానికి సంబంధించి సిబిఐ దాఖలు చేసిన ఛార్జీషీటులో వీరు కోర్టుకు రానున్నారు. దాల్మియా వ్యవహారంపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జీషీటును గత నెల కోర్టు విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకొని నిందితులకు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా నిందుతులు కోర్టులో హాజరై సమన్లు తీసుకోవాల్సి ఉంది.

జగన్, విజయ సాయి రెడ్డిలను అధికారులు కోర్టులో హాజరుపర్చుతారు. ఈ కేసులో పునీత్ దాల్మియా, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, ఈశ్వర్ సిమెంట్స్ ఎండి సజ్జల దివాకర్ రెడ్డి, సంజయ్ ఎస్.మిత్ర, నీల్ కమల్ బేరీ, రఘురామ్, దాల్మియా సిమెంట్స్ ప్రతినిధులు హాజరు కానున్నారు.

విజయ సాయికి ప్రత్యేక కేటగిరి

బెయిల్ రద్దయి చంచల్‌గూడ జైలుకు చేరుకున్న విజయ సాయి రెడ్డికి కోర్టు స్పెషల్ కేటగిరి ఖైదీగా పరిగణించాలని జైలు అధికారులను ఆదేశించింది. ఆయనను ప్రత్యేక ఖైదీగా గుర్తిస్తూ అరెంజ్‌మెంట్స్ చేయాలని ఆదేశించింది. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని సాయి పిటిషన్ దాఖలు చేసుకోవడంతో కోర్టు అంగీకరించింది. మరోవైపు బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్ పైన సిబిఐ కౌంటర్ దాఖలు చేయనుంది.

English summary
Former Home Minister Sabitha Indra Reddy and YSR Congress Party chief YS Jaganmohan Reddy in DA case will appear before the CBI special court in Nampally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X